Saturday, January 22, 2022
Home రాష్ట్రం దృష్టి మ‌ర‌ల్చేందుకు కేంద్రంపై నింద‌లు : హ‌రిప్ర‌సాద్‌

దృష్టి మ‌ర‌ల్చేందుకు కేంద్రంపై నింద‌లు : హ‌రిప్ర‌సాద్‌

హైద‌రాబాద్‌, వార్తానిధి: రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే కేంద్రంపై నింద‌లు వేస్తోంద‌ని బిజెవైఎం మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి అర్బ‌న్‌ జిల్లా అధికార ప్ర‌తినిధి జి.హ‌రిప్ర‌సాద్ అన్నారు.

బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేర‌కు పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం విధిస్తున్న వ్యాట‌న్ త‌గ్గించాల‌ని డిమాండ్ చేస్తూ హ‌రిప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని బుధ‌వారం నిర్వ‌హించారు.

ఈ విష‌య‌మై హ‌రిప్ర‌సాద్ మాట్లాడుతూ ద‌ళిత బంధు, ఉద్యోగ నోటిఫికేష‌న్లు, డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు వంటి అంశాల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌రల్చేందుకు సీఎం కెసిఆర్ కొత్త నాట‌కానికి తెర‌లేపారని ఆరోపించారు.

అంతేకాకుండా ఆరోగ్య‌శ్రీ వంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌కుండా అట‌కెక్కించింద‌ని విమ‌ర్శించారు. క‌నీసం కేంద్ర ప్ర‌భుత్వ ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని కూడా అమ‌లు చేయ‌డంలేద‌న్నారు.

పార్ల‌మెంటులో రైతు చ‌ట్టాల‌కు మ‌ద్ధ‌తు తెలిపిన టిఆర్ఎస్ ప్ర‌భుత్వం.. ర‌ద్దు చేసే స‌మ‌యానికి ధాన్యం కొనుగోలు పేరిట ధ‌ర్నా చేసింద‌ని ఎద్దేవా చేశారు.

ప్ర‌స్తుతం రైతుల ప‌క్షాన నిలుస్తున్నామ‌ని చెబుతూ.. ప్ర‌భుత్వ వైఫల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు టిఆర్ఎస్ ప్ర‌భుత్వ పెద్ద‌లు య‌త్నిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వం డీజిల్‌, పెట్రోల్‌పై సుంకం త‌గ్గించిన విష‌యాన్ని హ‌రిప్ర‌సాద్ గుర్తుచేశారు. మ‌రి రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేద‌ని ఆరోపించారు.

ప్ర‌స్తుతం ఆర్టీసి, విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్ధ‌మైన ప్ర‌భుత్వం.. తాను విధించే ప‌న్నుల త‌గ్గించ‌కుండా కేంద్రంపై నింద‌లు వేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని ప్ర‌శ్నించారు.

ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌తి దానికి కేంద్రంపై నింద‌లు వేసేది ఉంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌గ్గాలు చేప‌ట్ట‌డం ఎందుక‌ని అన్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు ఒంటెద్దు పోక‌డ‌లు మానుకోవాల‌ని.. ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల‌ని హిత‌వు ప‌లికారు.

ఈ కార్య‌క్ర‌మంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా బిజెవైఎం ఉపాధ్య‌క్షులు తిరుప‌తి రెడ్డి, పృథ్వి నాగ‌రాజు, ఐటీ సెల్ స‌భ్యుడు శ్రీనివాస్ చారి, సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ అభిషేక్‌..

బిజెవైఎం బాలాజీన‌గ‌ర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు శివాజీ, అల్లాపూర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు శేషు, ఫ‌తేన‌గ‌ర్ డివిజ‌న్‌ బిజెపి ఎస్టీ మోర్చా ఉపాధ్య‌క్షుడు రాజు నాయ‌క్‌, డివిజ‌న్ నాయ‌కుడు జె.రాకీ, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments