Saturday, January 22, 2022
Home రాష్ట్రం ఐల‌య్య ఆధ్వ‌ర్యంలో ఇందిరా గాంధీ జ‌యంతి

ఐల‌య్య ఆధ్వ‌ర్యంలో ఇందిరా గాంధీ జ‌యంతి

విలేక‌రి : సురేశ్

అక్క‌న్న‌పేట‌, వార్తానిధి: అక్క‌న్న‌పేట మండ‌ల కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు జంగ‌ప‌ల్లి ఆధ్వ‌ర్యంలో దివంగ‌త మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరా గాంధీ జ‌యంతిని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఇందిరా గాంధీ చిత్ర ప‌టానికి పూల మాల‌లు వేసి కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు నివాళులు అర్పించారు. అనంత‌రం ఐల‌య్య మాట్లాడారు.

దివంగ‌త ఇందిరా గాంధీ దేశంలో పేదరిక నిర్మూల‌న‌కు కృషి చేశార‌న్నారు. త‌న పాల‌న‌లో ప్ర‌జ‌లంద‌రి ఆద‌ర‌ణ‌ను చూర‌గొన్నార‌ని చెప్పారు.

ఆమె దేశానికి చేసిన సేవ‌లు ఎన‌లేనివ‌ని వివ‌రించారు. కాంగ్రెస్ పార్టీని బ‌ల‌ప‌రచ‌డ‌మే ఇందిరా గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఇవ్వ‌గ‌లిగే ఘ‌న‌మైన నివాళి అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో గుడాటిప‌ల్లి స‌ర్పంచ్ బ‌ద్దం రాజిరెడ్డి, కాశ‌బోయిన యాద‌గిరి, మాజీ ఎంపీటీసీ మ్యాక ర‌మేశ్‌, మ‌ల్లంప‌ల్లి అధ్య‌క్షుడు కొలిపాక సంప‌త్‌, పిరెళ్ల లింగ‌మూర్తి, చింత‌ల బాల‌రాజు, టేకుల ర‌మేష్‌..

మిట్ట‌ప‌ల్లి బాల‌య్య‌, కాశ‌బోయిన యాద‌గిరి, మేడబోయిన సాంబ‌రాజు, పొడిశెట్టి వెంక‌న్న‌, యూత్ కాంగ్రెస్ నాయ‌కులు చొక్కం గ‌ణేష్‌, దేవునూరి రాజు, గుగులోత్ రాజు నాయ‌క్‌, న‌కిర్తి మునిరాజ్‌, పొడిశెట్టి వెంక‌న్న త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments