Saturday, January 22, 2022
Home రాష్ట్రం స్మ‌శాన వాటిక‌లో వ‌స‌తుల అభివృద్ధి : కార్పొరేట‌ర్ శ్రావ‌ణ్‌

స్మ‌శాన వాటిక‌లో వ‌స‌తుల అభివృద్ధి : కార్పొరేట‌ర్ శ్రావ‌ణ్‌

మ‌ల్కాజ్‌గిరి, వార్తానిధి: మ‌ల్కాజ్‌గిరి డివిజ‌న్ ప‌రిధిలోని స‌ర్దార్ ప‌టేల్‌న‌గ‌ర్ హిందూ స్మ‌శాన వాటిక‌ను స్థానిక కార్పొరేట‌ర్ శ్రావ‌ణ్ వూర‌ప‌ల్లి సోమ‌వారం సంద‌ర్శించారు.

గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా స్మ‌శాన వాటిక‌ను నిర్వ‌హిస్తున్న పెద్ద‌ల‌తో వ‌స‌తుల విష‌య‌మై మాట్లాడారు. కావాల్సిన వ‌స‌తుల‌ను అభివృద్ధి చేయాల‌ని అధికారుల‌ను కోరారు.

వ్య‌క్తి మృతి చెందిన త‌రువాత అత‌నికి అంతిమ సంస్కారాల‌ను నిర్వ‌హిస్తార‌ని చెప్పారు. అందుకు స్మ‌శాన వాటికకు వ‌స్తార‌ని అన్నారు.

క‌ర్మ‌కాండ‌ల‌ను నిర్వ‌హించేందుకు వ‌చ్చే వారికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేలా వ‌స‌తుల‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామ‌ని వెల్ల‌డించారు.

ప్ర‌త్యేక వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌…
న‌వంబ‌రు 2న డివిజ‌న్ ప‌రిధిలోని భ‌గ‌త్‌సింగ్‌న‌గ‌ర్ అంగ‌న్‌వాడీ కేంద్రం, నేరెడ్మెట్‌లో ఉన్న మ‌ల్కాజ్‌గిరి ప్రాథ‌మిక ఆరోగ్య ఏంద్రం, మ‌ల్కాజ్‌గిరి క్రాస్ రోడ్స్‌లోని పాత మున్సిప‌ల్ కార్యాల‌యం, మున్సిప‌ల్ ఆఫీస్ ప‌క్క‌నే ఉన్నా ఏరియా ఆసుప‌త్రిలో, సీతారాంన‌గ‌ర్‌లోని శివాల‌యంలో ప్ర‌త్యేక వ్యాక్సినేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కార్పొరేట‌ర్ వెల్ల‌డించారు.

ఉద‌యం 9.30 గంట‌ల‌కు డ్రైవ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు. కోవిషీల్డ్ మొద‌టి, రెండో డోసులు అందుబాటులో ఉంటాయ‌న్నారు. కేవ‌లం 200ల డోసుల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments