Saturday, January 22, 2022
Home రాజ్యం తిరుమ‌ల ఘాట్ రోడ్-మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌-ఇంజ‌నీర్స్ డే

తిరుమ‌ల ఘాట్ రోడ్-మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌-ఇంజ‌నీర్స్ డే

భార‌త‌దేశ తొలి ఇంజ‌నీర్‌ మోక్షగుండం విశ్వేశ్వ‌ర‌య్య‌. ఆయ‌న దేశానికి అందించిన సేవ‌ల‌కు గానూ ప్ర‌తి ఏడాది సెప్టెంబ‌ర్ 15న ఆయ‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకొని ఇంజ‌నీర్స్ డే జ‌రుపుకుంటాము.

అప్ప‌టి మైసూర్ సంస్థానంలోని చిక్క‌బ‌ల్లాపూర్ జిల్లా ముద్ద‌న‌హ‌ళ్లి గ్రామంలో ఓ తెలుగు బ్రాహ్మ‌ణ కుటుంబంలో 1860, సెప్టెంబ‌ర్ 15న విశ్వేశ్వ‌ర‌య్య జ‌న్మించారు.

ఫాద‌ర్ ఆఫ్ మోడ్ర‌న్ మైసూర్ అని ఆయ‌న‌ను పిలుచుకుంటారు. దేశంలోని అత్యుత్త‌మ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు ఆయన ఇంజనీరుగా వ్యవహరించారు.

ముఖ్యంగా మైసూర్‌లోని కృష్ణ రాజా సాగ‌ర డ్యామ్ నేటికి ఒక ఇంజ‌నీరింగ్ అద్భుతంగా నిలుస్తోంది. గ్వాలియ‌ర్‌లోని తిగ్రా డ్యామ్‌కు కూడా విశ్వేశ్వ‌ర‌య్య ఇంజ‌నీరుగా ప‌నిచేశారు.

స‌ముద్రం నీటి కోత‌కు గురి కాకుండా విశాఖ‌ప‌ట్నం నౌకాశ్ర‌యాన్ని ర‌క్షించే వ్య‌వ‌స్థ‌ను కూడా ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌నంలో రూపొందించారు.

ముఖ్యంగా నేడు భ‌క్తులంద‌రూ తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని బ‌స్సులు, కార్ల‌లో వెళ్లి ద‌ర్శించుకోగ‌లుగుతున్నారంటే.. అది విశ్వేశ్వ‌ర‌య్య ద్వారా వేంక‌టేశ్వ‌రుడు ఇచ్చిన అనుగ్ర‌హ‌మే అనుకోవాలి.

1944లో ప్ర‌తిపాదించిన మొద‌టి ఘాట్ రోడ్డు నిర్మాణంలో విశ్వేశ్వ‌ర‌య్య కీల‌క పాత్ర‌ను పోషించారు. వ‌ర్షాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఘాట్ రోడ్డు గుండా ప్ర‌యాణించ‌వ‌చ్చు.

ముఖ్యంగా హైద‌రాబాద్‌లో వ‌ర‌ద ముంపు నివార‌ణ కోసం వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డానికి నిజాంకు విశ్వేశ‌ర‌య్య స‌ల‌హాదారుడిగా వ్య‌వ‌హ‌రించారు.

అది మాత్ర‌మే కాకుండా నేడు ప్ర‌ముఖ‌మైన మైసూర్ సాండ‌ల్ సోప్ ప‌రిశ్ర‌మ‌, మైసూర్‌ ఐర‌న్ అండ్ స్టీల్ లిమిటెడ్‌తో పాటు మ‌రెన్నో అద్భుత‌మైన నిర్మాణాల‌ను చేశారు.

ఆయ‌న‌ను సంస్మ‌రించుకుంటూ ప్ర‌తి ఏటా ఇంజ‌నీర్స్ డే జ‌రుపుకోవ‌డం ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చెప్పుకోవ‌డం అతిశ‌యోక్తి కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments