Saturday, January 22, 2022
Home రాష్ట్రం ఆత్మ గౌరవం నిలబడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి : జంగపల్లి ఐలయ్య

ఆత్మ గౌరవం నిలబడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి : జంగపల్లి ఐలయ్య

అక్క‌న్న‌పేట‌, వార్తానిధి: ద‌ళిత‌-గిరిజ‌నుల ఆత్మ‌గౌర‌వం నిల‌బడాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల‌ని అక్క‌న్న‌పేట మండ‌ల కాంగ్రెస్ అధ్య‌క్షుడు జంగ‌ప‌ల్లి ఐల‌య్య అన్నారు.

అక్కన్నపేట మండలం పరిధిలోని గోవర్ధనగిరి, రేకొండ గ్రామాలలో దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోర కార్యక్రమ‌ సమావేశాలు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్రములో ఏ పల్లెలకు వెళ్లిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప కేసీఆర్ ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూమ్‌లు లేవ‌న్నారు.

కొన్ని చోట్ల కట్టించిన ఇండ్లు పందులు, కుక్కలు వంటి జంతువులకు స్థావరాలుగా మారాయ‌న్నారు. అన్ని గ్రామాల దళిత, గిరిజనులకు కూడా ద‌ళిత బందు ప‌థ‌క ప్ర‌యోజ‌నం చేకూర్చాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో అక్క‌న్న‌పేట ఎస్టీ సెల్ అధ్య‌క్షుడు రాంబాబు నాయ‌క్‌, మైనారిటీ సెల్ అధ్య‌క్షుడు ఎండీ ఫ‌రీద్‌, యూత్ అధ్య‌క్షుడు చొక్కం గ‌ణేష్‌, ఎంపీటీసీ గొర్ల స్వ‌ప్న‌, గ్రామాధ్య‌క్షుడు జెరిపోతుల ఆంజ‌నేయులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

వారితో పాటు హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు ఈసంప‌ల్లి శ్రీకాంత్‌, సీనియ‌ర్ నాయ‌కులు కోళ్ల మొండ‌య్య‌, ఎల్లయ్య, కనకయ్య, బంతుల్ల సతీష్, గొర్ల రమేష్, అరుణ్, వంశీ, ఫయాజ్, సాలిమ్, హన్వార్, రాజు, ష‌బ్బీర్‌, అశోక్, సురేష్, రాజకిరణ్, నరేష్, రవి, సందీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments