Saturday, January 22, 2022
Home రాజ్యం ఇండియ‌న్స్ ఓన్లీ... ఎందుకో?

ఇండియ‌న్స్ ఓన్లీ… ఎందుకో?

ఇటీవ‌ల ఇండియ‌న్స్ ఓన్లీ అనే ట్రెండ్ న‌డుస్తోంది. అంటే త‌మ‌కు కులం, మ‌తం లేదు తామంతా ఇండియ‌న్స్ అని చెప్పే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అలా ఎందుకు?

ఇన్ని రోజులు సెక్యుల‌రిజం పేరిట మైనారిటీల సంక్షేమం.. మెజారిటీల నుంచి ప‌న్నుల వ‌సూళ్లు.. జ‌రిపే రాజ‌కీయ పార్టీలు. ఇండియ‌న్స్ ఓన్లీ అనే పాట‌ను ఎందుకు అందుకున్నాయి.

అందుకు కార‌ణం లేక‌పోలేదు.. ఇన్నాళ్లు సెక్యుల‌ర్ పార్టీలు మెజారిటీల‌ను కులాల పేరిట విడ‌దీస్తూ వ‌చ్చింది. తొలుత ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు ముసుగులో క్రైస్త‌వీక‌ర‌ణ‌కు బీజం వేశాయి ఆ పార్టీలు.

త‌రువాత బీసీలు, బీసీల వ‌ర్గీక‌ర‌ణ పేరిట మెజారిటీల్లో చీలిక తెచ్చాయి. మైనారిటీల సంతుష్టీక‌ర‌ణ‌తో ఇస్లామిక్ అక్ర‌మ‌వ‌ల‌స‌దారుల‌ను ఓటు బ్యాంకుగా మార్చుకున్నాయి.

మ‌త మార్పిడుల‌ను ప్రోత్స‌హిస్తూ ఎస్సీల‌ను క్రైస్త‌వంలో చేర్చాయి. అలా త‌మ ఓటు బ్యాంకును ప‌దిలం చేసుకునేందుకు సెక్యుల‌ర్ పార్టీలు కుట్ర‌ల‌ను కొన‌సాగించాయి.

మైనారిటీ సంతుష్టీక‌ర‌ణ ముసుగులో మెజారిటీల చీలిక అణ‌చివేత అధిక‌మైంది. మెజారిటీల ఆచార‌వ్య‌వ‌హారాలు, సంప్ర‌దాయాలు, సంస్కృతి ప‌ర‌మైన అంశాల్లో ప్ర‌భుత్వం జోక్యం పెరిగింది.

సెక్యుల‌రిజం అంటే కేవ‌లం మైనారిటీ సంతుష్టీక‌ర‌ణ అనే స్థాయికి సెక్యుల‌ర్, ప్రాంతీయ పార్టీలు రాజ‌కీయాల‌ను దిగ‌జార్చాయి. పండుగ వేళ ఆంక్ష‌లు, పండుగ‌ల నిర్వ‌హ‌ణ‌ను అడ్డుకునేందుకు అధికారం, కోర్టుల ద్వారా య‌త్నాలు జోరందుకున్నాయి.

వివిధ మాధ్య‌మాల్లో మెజారిటీ ప్ర‌జ‌ల ధ‌ర్మాన్ని అవ‌మానించేలా, అవ‌హేళ‌న చేసేలా, కించ‌ప‌రిచేలా వ్య‌వ‌హారం ముదిరిపోయింది. మెజారిటీల‌ను క‌నుమ‌రుగు చేసేందుకు కుట్ర‌లు బ‌ల‌ప‌డుతున్నాయి.

నానా విధ వ్యూహాల‌తో సెక్యుల‌ర్‌, సోష‌లిస్ట్‌, రేష‌న‌లిస్ట్, హ్యుమ‌నిస్టులు బ‌య‌లుదేరారు. అయితే ఆ కుట్ర‌ల‌న్నింటినీ గుర్తించే వారి సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతోంది.

చీలిక‌లు, అణ‌చివేత‌ను వ్య‌తిరేకించే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. దీంతో చాలా వ‌ర‌కు కుట్ర‌లు నీరు గారిపోతున్నాయి. మెజారిటీల్లో రెండు మైనారిటీ వ‌ర్గాల వారిపై ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది.

అక్ర‌మంగా దేశంలోకి చొర‌బ‌డి సంక్షేమ ప‌థ‌కాలను అనుభ‌విస్తూ.. తిన్నింటి వాసాలు లెక్క‌బెట్ట చూసే వారి ప‌ట్ల జాలి ద‌య చూపించేవారు లేకుండా పోతున్నారు.

ఇటువంటి ప‌రిస్థితి త‌లెత్తండా సెక్యుల‌ర్, ప్రాంతీయ పార్టీల‌కు క‌ష్ట‌మే. ఎందుకంటే వాటిని న‌డిపే శ‌క్తికి అది జీర్ణించుకోద‌గిన అంశం కాదు కాబ‌ట్టి.

అందుకు మ‌నుషులంతా స‌మాన‌మే.. అంద‌రిలోనూ మాన‌వ‌త్వం ఉంటుంది.. మాకు కులం, మ‌తం లేదు అనే నినాదాన్ని తెర‌పైకి తెస్తున్నారు. ఇండియ‌న్స్ ఓన్లీ అనే పాట‌ను అందుకున్నారు.

నిజంగా ఇండియ‌న్స్ అయితే క్రైస్త‌వీక‌ర‌ణ‌ను ఆపాలి.. ఇస్లామిక్ అక్ర‌మ చొర‌బాటుదారుల‌ను దేశం నుంచి వెళ్ల‌గొట్టేందుకు స‌హ‌క‌రించాలి. హిందువులు మ‌సీదు, చ‌ర్చికి వెళ్తున్న‌ట్లు ముస్లింలు, క్రైస్త‌వులు ఆల‌యాల‌కు వ‌చ్చి ప్ర‌సాదం స్వీక‌రించాలి. ఇండ్ల‌లో పూజ‌ల‌ను చేయాలి.

అప్పుడు క‌దా ప‌ర‌స్ప‌ర గౌర‌వం.. మాన‌వ‌త్వం.. సౌభ్రాతృత్వం.. అనే మాట‌ల‌కు ఒక అర్థం ఉంటుంది. కానీ అవేవి జ‌ర‌గ‌వు.. ఇండియ‌న్స్ అనే మాట ప్ర‌క‌ట‌న‌ల‌కు.. మెజారిటీల‌కే ప‌రిమితం అవుతుంది.

సెక్యుల‌రిజం పేరిట మెజారిటీల ధ‌ర్మ‌గ్లాని కొన‌సాగుతూనే ఉంటుంది. దానిని ప్ర‌శ్నించే వారిపై మ‌తోన్మాదులు, హిందు ఉగ్ర‌వాదుల‌నే ముద్ర‌ప‌డుతూనే ఉంటుంది.

గ‌తంలో గుర్తు రాని ఓన్లీ ఇండియ‌న్స్ ఇప్పుడెందుకో గ్ర‌హించాలి. మ‌నం ఓన్లీ ఇండియ‌న్స్ కాదు.. మ‌నం మ‌హోన్న‌త‌మై స‌నాత‌న ధ‌ర్మ వార‌సులం. సైన్స్ కూడా ఊహించ‌లేనంత అద్భుతాలు సృష్టించిన పూర్వీకుల నూత‌న త‌రాల‌కు చెందిన‌వారం.

అంతే త‌ప్ప‌.. డొల్ల‌త‌నంతో నిండిన‌.. పూర్వ‌పు వైభ‌వం తెలియ‌ని.. సెక్యుల‌రిజం ముసుగులో ఇస్లామీక‌ర‌ణ‌, క్రైస్త‌వీక‌ర‌ణ‌ను ప్రోత్స‌హించే మూర్ఖులం ఎంత‌టికి కాము.

అలా అని మ‌న‌మెప్పుడూ హింస‌ను కోరుకోలేదు. అన్యాయాన్ని, అధ‌ర్మాన్ని స‌హించ‌లేదు. వ‌సుధైక కుటుంబకం అనే గొప్పత‌నం మ‌న సొంతం. కానీ దాన్ని ఆచ‌రించ‌కుండా అవ‌మానించే వారికి త‌ల‌వంచే ర‌కాలం ఎంత మాత్రం కాదు.

మెజారిటీ సంప్ర‌దాయాల‌ను, ఆచార‌వ్య‌వ‌హారాల‌ను, సంస్కృతిని, ధ‌ర్మాన్ని గౌర‌విస్తూ ఉండే వారితో భార‌తీయులుగా మ‌న‌కు ఎటువంటి స‌మస్య లేదు. వాటిని అవ‌హేళ‌న చేస్తూ.. అవ‌మాన‌ప‌రుస్తూ.. క‌నుమ‌రుగు చేయాల‌ని చూసే వారితోనే అసలు స‌మ‌స్య‌.

కాబ‌ట్టి ఇండియ‌న్స్ ఓన్లీ అనే ప్ర‌చారంలో మూర్ఖులుగా మారొద్దు. స‌నాత‌న వార‌స‌త్వాన్ని కోల్పోవ‌ద్దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments