Saturday, January 22, 2022
Home రాష్ట్రం నా నినాదం ఏకాత్మ‌వాదం : కార్పొరేట‌ర్ శ్ర‌వ‌ణ్‌

నా నినాదం ఏకాత్మ‌వాదం : కార్పొరేట‌ర్ శ్ర‌వ‌ణ్‌

మ‌ల్కాజ్‌గిరి, వార్తానిధి: నా నినాదం ఏకాత్మ‌వాదమని మ‌ల్కాజ్‌గిరి కార్పొరేట‌ర్ శ్రవణ్ ఊర‌ప‌ల్లి అన్నారు. రాఖీ పూర్ణిమ‌ను పుర‌స్క‌రించుకొని త‌న ఇంటి వద్ద వేడుక‌ల‌ను ఆదివారం జ‌రుపుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌జ‌లంద‌రూ ఆత్మ స్వ‌రూపులేన‌ని.. అంద‌రూ స‌మాన‌మేన‌ని తాను న‌మ్ముతాన‌న్నారు. వ‌సుదైక కుటుంబ‌కం అనే నినాదం భార‌తీయ సంస్కృతిలో అంత‌ర్లీన‌మై ఉంటుంద‌ని పేర్కొన్నారు.

అంతేకాకుండా అంత్యోద‌య అనే నినాదంతో నిరుపేద‌లు సైతం ఉన్న‌త స్థితికి చేరాల‌ని త‌మ పార్టీ కాంక్షిస్తుంద‌న్నారు. జాతీయ‌వాద‌మే ఊపిరిగా సాగేలా సంఘ్ సిద్ధాంతాలు త‌నను తీర్చిదిద్దాయ‌ని వివ‌రించారు.

దేశాన్ని జ‌న్మ‌భూమి, క‌ర్మ‌భూమిగా భావించే ప్ర‌తిఒక్క‌రూ హిందుస్థాన్ వాసులేన‌ని పేర్కొన్నారు. అందులో ఎటువంటి తార‌త‌మ్యాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు.

రాజ్యాంగంలో కూడా ప్రజ‌లంతా స‌మాన‌మేన‌ని, ప్ర‌జ‌ల‌కే సార్వ‌భౌమాధికారాన్ని క‌ట్ట‌బెట్టిన విష‌యాన్ని గుర్తుచేశారు. తాను ప్ర‌జాప్ర‌తినిధిగా ఎన్నిక‌వ్వ‌డం ప్ర‌జ‌లు త‌న‌కిచ్చిన గొప్ప అవ‌కాశం అన్నారు.

భ‌విష్య‌త్తులో వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకునేలా ప‌నిచేస్తాన‌ని తెలిపారు. ప్ర‌తి పౌరుడు ఏకాత్మ‌వాదాన్ని ఆక‌ళింపు చేసుకుంటూ.. జాతీయ‌వాదాన్ని బ‌ల‌ప‌రుస్తూ.. భార‌త్‌ను విశ్వ‌గురువు చేసే మ‌హ‌త్త‌ర కార్యంలో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments