Saturday, January 22, 2022
Home క్రీడా విశ్వ క్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరం: సీఎం కెసిఆర్

విశ్వ క్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరం: సీఎం కెసిఆర్

తెలంగాణ, వార్తానిధి: 41 ఏండ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమని తెలంగాణ సీఎం కెసిఆర్ అన్నారు.

టోక్కో ఒలంపిక్స్ లో హాకీ, బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడారు.

హకీ జట్టు విజయంతో భారతదేశపు ప్రముఖ క్రీడ హాకీ విశ్వ వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అందుకు కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ ను, జట్టు క్రీడాకారులను సీఎం ప్రశంసించారు.

మహిళా బాక్సింగ్ కేటగిరీలో తొలిసారి బరిలోకి దిగి కాంస్యం సాధించిన అస్సాంకు చెందిన భారత బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్ ని సీఎం అభినందించారు.

ఒలింపిక్స్ లో దేశం తరపున పతకం నెగ్గిన మూడో బాక్సర్‌గా లవ్లీనా చరిత్రకెక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భారత క్రీడాకారులు విశ్వ క్రీడల్లో విజయకేతనం ఎగరేసి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments