Saturday, January 22, 2022
Home జీవన శైలి దుష్టులకు దూరంగా ఉండాలి.. స్నేహితులైనా స‌రే..!

దుష్టులకు దూరంగా ఉండాలి.. స్నేహితులైనా స‌రే..!

ఈ రోజుల్లో ఎన్నో బంధాలు దూరం అవుతున్నా ఒక్క స్నేహబంధం మాత్రం దృఢంగా ఉంటోంది. ట్రెండు మారినా ఫ్రెండు మారడు అన్నారు ఓ సినీ గేయ ర‌చ‌యిత‌.

అది కూడా నిజ‌మే కాబోలు.. చిన్నప్పుడు ఆటల్లో పరిచయమైన స్నేహితులే కావచ్చు, స్కూళ్లో, కాలేజీలో, ఆఫీసులలో, వ్యాపారంలో, కాలనీలో ఇలా జీవితంలో ప్రతి అడుగులోనూ ప‌రిచ‌యాలు ఏర్ప‌డుతాయి.

వాటిల్లో కొన్ని స్నేహ‌బంధంగా మారి కొనసాగుతాయి. అయితే రోజులు మారుతున్నా కొద్ది ప‌రిస్థితులు మారుతాయి. ప‌రిస్థితులు మ‌నిషి మ‌న‌స్త‌త్వాన్ని మారుస్తాయి.

ప‌సిత‌నంలో ఉన్న స్వ‌చ్ఛ‌మైన మ‌న‌స్త‌త్వం పెరుగుతున్న కొద్ది అభ‌ద్ర‌తా భావ‌న కార‌ణంగా, జీవితంలో ఎదుర‌య్యే అనుభ‌వాల కార‌ణంగా మారిపోతుంది. స్నేహితుల స్వ‌భావం కూడా మారుతుంది.

ఈ రోజుల్లో అవ‌స‌రాలు బంధాల‌నూ శాసిస్తున్నాయి. స్నేహం అందుకు అతీత‌మైన‌ది కాదు. అందుకు మ‌న పెద్ద‌లు గుర్తెరిగి వ్య‌వ‌హ‌రించ‌మ‌ని చెబుతారు.

మ‌న స్నేహితుల‌ను చూసి మ‌న‌మెంటో చెప్పే రోజులు దూర‌మయ్యాయనే అనుకోవాలి. ముఖాల‌కు మేలిమి ముసుగులు వేసుకొని.. అంత‌రంగాల‌లో స్వార్థాన్ని క‌లిగిన వారే మ‌న చుట్టూ ఎక్కువ‌.

చిన్న‌త‌నంలో మన ఇంట్లోవాళ్ళు, టీచర్లు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, వాడితో తిరిగితే చెడిపోతావు వీడితో ఉంటే బాగుపడతావు అని. అది నిజ‌మే కావొచ్చు కూడా..

కొంతమంది స్నేహితులు మన జీవితాన్నే మలుపు తిప్పుతారు. అలాంటి మన హితం కోరే స్నేహితులని జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా ముఖ్యం.

స‌మాజంలో ముఖ ప‌రిచ‌యం.. వ్య‌వ‌హారాలు మ‌నుగ‌డ‌కు అవ‌స‌రం. అయితే ఎవ‌రితో ఎలా ఉండాల‌నేది మ‌న వ్య‌క్తిగ‌త విష‌యం. కాక‌పోతే కొంద‌రితో హాయ్‌.. బాయ్ వ‌ర‌కే ప‌రిచ‌యాన్ని ప‌రిమితం చేసుకోవాలి.

అలాంటి ప‌రిచ‌య‌స్తులైన స్నేహితుల‌ను గురించి నా అనుభ‌వంలోనికి కొన్ని మీతో పంచుకుంటాను..

“నా వల్లే ప్రాబ్లమ్ ఐతే నేను వెళ్లిపోతా మామ ర‌కం”:
ప్రాబ్లమ్ ఉందని పిలిస్తే వచ్చే స్నేహితుల కంటే, పార్టీ ఇస్తా అంటే వచ్చే స్నేహితులే ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. చేసిందంతా చేసి మనల్ని ఇరికించి వాళ్ళ తప్పు ఏమీ లేదన్నట్లు తప్పించుకుంటారు. ఇటువంటి వారితో ఎప్పటికైనా ప్రమాదమే.

“మందుబాబుల బ్యాచ్”:
చీర్స్ అంటూ తాగడం కోసం మాత్రమే కలిసే స్నేహితులకి వీలైనంత దూరంగా ఉండండి. వీరి వలన ఆరోగ్యంతో పాటు స‌మాజంలో మన గౌరవం కూడా దెబ్బ తింటుంది.

“చిచ్చు పెట్టె బ్యాచ్”:
మన వెనకే మన గురించి మిగితా ఫ్రెండ్స్ తో తప్పుగా మాట్లాడుతూ.. మన కుటుంబ విషయాల్లో తల దూర్చి తగాదాలకు కార‌ణ‌మవుతారు. అలాంటి వారిని నమ్మి వ్య‌క్తిగ‌త గోప్య‌మైన‌ విషయాలు పంచుకోకండి. వారితో సాధ్యమైనంత వరకు మీ పర్సనల్స్ గురించి చర్చించకండి.

“కాస్టిలీ ఫ్రెండ్ షిప్”:
మనం ఎప్పుడో చిన్నప్పుడు కలిసి తిరిగిన ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి డబ్బులు అడుగుతారు. వారి మొహం కూడా గుర్తు లేకపోయినా మొహమాటం కొద్దీ డబ్బులు పంపిస్తాం. అతను అదే పనిగా ప్రతి సారి అప్పు అడిగి తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతాడు. అలాంటి వారిని సున్నితంగా తిరస్కరించండి.

“టైం పాస్ బ్యాచ్”:
“వాడివల్లే నా జీవితం ఇలా నాశనం అయ్యింది, చదువుకునే రోజుల్లో తిప్పి తిప్పి నన్ను పిప్పి చేశాడు అని అనుకుంటూ ఉంటాం. ఈ రకం స్నేహితులు ఏ పని లేకపోయినా బైక్ వేసుకొని వచ్చి రోజంతా బలాదూర్ తిప్పుతారు. దీని వల్ల మన ముఖ్యమైన పనులు వాయిదా పడి విలువైన సమయం వృధా అవుతుంది.

“డబ్బా రాయుళ్ళు”:
మాటల కోటలు కడతారు, తనకి అందరూ తెలుసని ఏ గొడవ జరిగినా చూసుకుంటానని మనల్ని రెచ్చగొట్టి ఊబిలోకి దింపుతారు. నెగిటివిటితో మనల్ని ఏ పనీ చేయనివ్వరు. వీరిని నమ్ముకుంటే మన గతి అధోగతే.

మనం మానసికంగా పరిపక్వత చెందేకొద్దీ మన అనుభవాలను బట్టి మిత్రుల సంఖ్య తగ్గుతుంది అంటారు.

“గంగిగోవుపాలు గంటెడైనను చాలు కడివెడైననేమి ఖరముపాలు” అలాగే మన జీవితంలో ఒక్క మంచి మిత్రుడున్నా చాలు.

వార్తానిధి తరపున మిత్రులందరికీ “స్నేహితులరోజు శుభాకాంక్షలు”

Prabhakar Vadduri
Love writing& Exploring

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments