Saturday, January 22, 2022
Home సంపాదకీయం పాక్ పై భారత్ విజయం - అమరవీరుల త్యాగఫలం కార్గిల్ విజయ్ దివస్

పాక్ పై భారత్ విజయం – అమరవీరుల త్యాగఫలం కార్గిల్ విజయ్ దివస్

వందే మాతరం, జై హింద్ అంటూ 1999 జూలై 26 న భారత సైన్యం, పాకిస్తాన్ సైన్యంపై వీరోచిత పోరాటం చేసి విజయం సాధించిన సందర్భంగా ఈరోజు కార్గిల్ విజయ దివస్ గా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. 527 మంది భరత మాత ముద్దు బిడ్డలు మన ప్రాణాలను కాపాడటం కోసం భారతమాత కి జై అంటూ వీర మరణం పొందారు. ఆరోజుకు గుర్తుగా అమ‌ర‌వీరుల‌ను మ‌నం స్మ‌రించుకుంటూ మ‌రి అస‌లు ఆ రోజున ఏం జ‌రిగింది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం!

జమ్ముకశ్మీర్‌లో ఉన్న కార్గిల్ కొండలను ఆక్రమించుకోవాలన్న‌ పాకిస్తాన్‌ కుట్రలను భారతదేశం విజయవంతంగా తిప్పికొట్టింది అందుకే దాన్ని కార్గిల్ యుద్ధం అని పిలిచాం. దాదాపు మూడు నెలలపాటు కొనసాగిన ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్‌ తోక ముడిచి పారిపోయేలా చేసి కార్గిల్‌ కొండలను రక్షించారు.

జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ ఎత్తైన కొండలను స్వాధీనం చేసుకుని వారి స్థావరాలను ఏర్పాటుచేసుకోవాలని పాకిస్తాన్ సైన్యం కుట్ర ప‌న్నింది. దీంతో మ‌న సైన్యం కూడా అప్ర‌మ‌త్త‌మ‌వ‌టంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. 1999 మే 3 న ప్రారంభమైన ఈ సంఘర్షణ చివరకు కార్గిల్‌ కొండలను కాపాడుకోవడంతో జూలై 26 న ముగిసింది. దాదాపు 12 మంది పాకిస్తాన్ సైనికులు కార్గిల్ అజామ్ పోస్టును స్వాధీనం చేసుకున్నారు. ఈ పాకిస్తాన్ సైనికులను భారత్‌కు చెందిన ఒక గొర్రెల కాపరి గుర్తించి భారత ఆర్మీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దాంతో పాకిస్తాన్‌ సైన్యం చొరబాటు గురించి సమాచారం వచ్చింది.దాంతో ‘ఆపరేషన్ విజయ్’ చేపట్టేందుకు భారత సైన్యం సన్నాహాలు ప్రారంభించింది.

కార్గిల్ కొండ‌లు చాలా ఎత్తైన కొండ‌లు పైగా అప్ప‌టికే పాక్ సైనికులు ఆ ఎత్తైన కొండ‌ల‌పై ఉన్నారు. దీనికార‌ణంగా వారితో యుద్ధం చేయ‌డానికి మ‌న సైనికులు చాలా ఇబ్బందుల‌నే ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. శ‌త్రువుల కంటికి క‌న‌ప‌డ‌కుండా ఉండ‌డానికి రాత్రివేళ‌ను వారు ఎంచుకున్నారు. రాత్రి స‌మ‌యంలో కొండ‌ల‌పైకి ఎక్కారు. కేవ‌లం వారు మాత్ర‌మే కాకుండా పాక్ సైన్యంని తిప్పికొట్టేందుకు ఇటు నావికాద‌ళం, వైమానిక ద‌ళం కూడా పెద్ద ఎత్తున కృషిచేశాయి.
మిగ్-29, మిరాజ్-2000 విమానాల ద్వారా వైమానిక దళం పాకిస్తాన్ సైనికులపై బాంబు దాడులు చేసి పాకిస్తాన్ రెండు యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఆకాశం నుంచి వైమానిక దళం దాడి, భూతలం నుంచి బోఫోర్స్ ఫిరంగుల నుంచి గుండ్లు పాకిస్తాన్ సైనికులను వర్షం కురిపించాయి.

రెండు నెలలకు పైగా కొనసాగిన ఈ యుద్ధంలో 527 మంది భారతీయ సైనికులు అమరవీరులయ్యారు. పాకిస్తాన్‌కు చెందిన దాదాపు 3,000 మంది సైనికులు కూడా మరణించారు. దాంతో పాకిస్తాన్‌ సైనికులు కాళ్లకు బుద్ధి చెప్పారు. అలా పాక్ పై మ‌నం సాధించిన విజ‌యానికి గుర్తుగా, అమ‌ర‌వీరుల త్యాగానికి ప్ర‌తీక‌గా అప్ప‌టి నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం జులై 26, కార్గిల్ విజ‌య్ దివ‌స్ గా జ‌రుపుకుంటున్నాం.

జై హింద్
జై భార‌త్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments