Saturday, January 22, 2022
Home సంపాదకీయం గోహ‌త్య‌ల వెనుక భారీ కుట్ర‌?

గోహ‌త్య‌ల వెనుక భారీ కుట్ర‌?

భార‌తీయులకు ప్ర‌ధాన జీవ‌నాధారం వ్య‌వ‌సాయం. సంప్ర‌దాయ వ్య‌వ‌సాయ విధానాల్లో గోవుల‌తో పాటు గోసంత‌తికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

నేటికి దేశ‌వ్యాప్తంగా ఉన్న అధిక శాతం ప‌ల్లెల్లో గోసంత‌తిని కుటుంబ స‌భ్యులుగా భావిస్తారు. అంతేకాదు గోవుల‌ను ఆరాధించ‌డం భార‌తీయ ఆచారాల‌లో భాగం.

పాశ్చాత్య పోక‌డ‌లు పెరుగుతున్న కొద్ది స‌మాజంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటి ప్ర‌భావం వ్య‌క్తుల‌పైనే కాకుండా వ్య‌వ‌స్థ‌ల‌పై కూడా ప‌డుతోంది.

త‌ద్వారా వ్య‌వ‌సాయం కూడా ప్ర‌భావితం అవుతోంది. ముఖ్యంగా గోఆధారిత వ్య‌వ‌సాయం క‌నుమ‌రుగు అవుతోంది. ఇప్ప‌టికే పంట పొలాల‌ను ర‌సాయనాలు క‌మ్మేస్తున్నాయి.

సంక‌ర విత్త‌నాల‌ను నాటుతూ ర‌సాయ‌నాల‌తో వాటిని పెంచుతూ మ‌నం కూడా ర‌సాయ‌నాల‌నే కూర‌గాయ‌లు, ధాన్యాలు, పండ్ల రూపంలో ఆహారంగా తీసుకుంటున్నాం.

త‌ద్వారా అనేక అనారోగ్యాలకు గుర‌వుతున్నాము కూడా. కానీ మ‌న పూర్వీకులు గోఆధారిత సంప్ర‌దాయ వ్య‌వ‌సాయం చేసేవారు. రసాయ‌నాల‌ను వాడేవారు కాదు.

పంచ‌గ‌వ్య విధానాల ద్వారా ఎరువుల‌ను త‌యారు చేసుకునేవారు. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన పంట‌ను పండించి వాటిని తిన‌డం ద్వారా ఆరోగ్యంగా ఉండేవారు.

కానీ నేటి ప‌రిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది. ట్రాక్ట‌ర్ల‌తో నేల‌ను లోతుగా చీలుస్తున్నారు. ర‌సాయ‌న ఎరువుల‌తో నేల‌ సారాన్ని దెబ్బ‌తీస్తున్నారు.

ఒక‌ప్పుడు ఎద్దుల స‌హాయంతో నాగ‌లిని వాడి పొలం దున్నేవారు. స‌హ‌జ ఎరువుల‌ను వినియోగించి నేల సారాన్ని కాపాడుతూ ప్ర‌కృతి వ్య‌వసాయం చేసేవారు.

అందుకు గోసంత‌తి ఎంతో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. నేటి ఆర్గానిక్ పంట‌ల విష‌యంలో కూడా గోవుల ప్రాధాన్యం ఎన‌లేనిద‌నే చెప్పుకోవాలి.

అలాంటి గోవుల‌ను, గోసంత‌తిని క‌బేళాల‌కు త‌ర‌లిస్తూ రోజూ హ‌త్య‌లు చేస్తున్నారు. ప‌శు పోష‌ణ‌ను కూడా మెల్లిగా ప‌ద్ధ‌తి ప్ర‌కారం నాశ‌నం చేస్తున్నారు.

త‌ద్వారా భ‌విష్య‌త్తులో గోసంత‌తిని నాశ‌నం చేసి.. వ్య‌వ‌సాయాన్ని కూడా క‌బ‌ళించేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌నే అభిప్రాయాలు నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు.

ఏది చేసినా కూటి కోస‌మే కాని.. అది ప్ర‌కృతికి చేటు చేసేదిగా ఉండొద్ద‌ని పెద్ద‌ల మాట‌. నేడు గోసంత‌తి అంత‌రించి పోతుండ‌డం, చెట్ల‌ను ఇష్టారీతిన న‌ర‌క‌డం వల్ల కలిగే దుష్ప్ర‌భావాల‌ను మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఇప్ప‌టికైనా గోమాత‌గా ర‌క్షించుకోలేక‌పోతే.. క‌నీసం సాధు జీవుల హ‌క్కుల‌ను కాపాడేందుకైనా మాట్లాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

లేదంటే ప్ర‌కృతి విప‌త్తులు.. విల‌యాల‌కు భావిత‌రాలు బాధ‌ప‌డ‌క త‌ప్ప‌దు. మ‌న‌కు మ‌న పెద్ద‌లు ఏ విధంగా అయితే సుర‌క్షిత‌మైన వాతావ‌ర‌ణం ఇచ్చారో..

అదే విధంగా మ‌న భావిత‌రాల‌కు ఇవ్వాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంది. ఆలోచించండి. ధ‌ర్మాన్ని ఆచ‌రించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments