Saturday, January 22, 2022
Home రాష్ట్రం తెలంగాణ నుంచి తొలి కేంద్ర కేబినెట్ మంత్రి : అప్పం శ్ర‌వ‌ణ్‌

తెలంగాణ నుంచి తొలి కేంద్ర కేబినెట్ మంత్రి : అప్పం శ్ర‌వ‌ణ్‌

జ‌హీరాబాద్‌, వార్తానిధి: కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రానికి త‌గిన ప్రాధాన్యం ఇస్తుంద‌ని జ‌హీరాబాద్ బిజెపి ప‌ట్ట‌ణ ఉపాధ్య‌క్షుడు అప్పం శ్ర‌వ‌ణ్ కుమార్ అన్నారు.

గ‌త 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం సికింద్రాబాద్ ఎంపీ కిష‌న్ రెడ్డికి కేంద్ర హోం శాఖ‌లో స‌హాయ‌మంత్రిగా ఎన్‌డీఏ అవ‌కాశం క‌ల్పించంద‌న్నారు.

ఆయ‌న త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించార‌ని శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు. ఈ మేర‌కు బుధ‌వారం జ‌రిగిన కేబినేట్ విస్త‌ర‌ణ‌లో కిష‌న్ రెడ్డికి పదోన్న‌తి క‌లిగింద‌న్నారు.

హోం శాఖ స‌హాయ‌మంత్రిగా సేవ‌లందించిన ఆయ‌న నేడు సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క‌, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ‌ల‌కు కేంద్ర మంత్రిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి ఒకే కేంద్ర కేబినేట్ మంత్రి ఉండ‌డం గర్వకార‌ణ‌మ‌ని శ్ర‌వ‌ణ్‌ పేర్కొన్నారు. ఇప్ప‌టికే వివిధ కేంద్ర ప‌థ‌కాలకు నిధుల‌ను నిరాటంకంగా కేంద్రం మంజూరు చేసింద‌న్నారు.

తెలంగాణ సంస్కృతికి పున‌ర్వైభ‌వం తీసుకురావ‌డానికి, రాష్ట్రంలోని ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను అభివృద్ధి చేయ‌డానికి కిష‌న్ రెడ్డి మ‌రింత కృషి చేస్తార‌నే న‌మ్మ‌కం త‌మ‌కుంద‌న్నారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నిర్ణ‌యంతో రాష్ట్రంలో బిజెపి బ‌లాన్ని పుంజుకుంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments