Saturday, January 22, 2022
Home రాజ్యం అఖండ భార‌త‌మా..? లేక ముక్క‌లైనా భార‌తాన్ని ఒక ద‌గ్గ‌ర‌కు చేర్చ‌డమా?

అఖండ భార‌త‌మా..? లేక ముక్క‌లైనా భార‌తాన్ని ఒక ద‌గ్గ‌ర‌కు చేర్చ‌డమా?

ఏంటి శీర్షిక అలా పెట్టాను అని చూస్తున్నారా.! రెండు ఒక‌టే క‌దా అనుకుంటున్నారా. ఆగండి.. అది అలా కాదు. నేను చెప్పే ప్ర‌య‌త్నం చేస్తాను.

వ్యాసం లాగా కాకుండా చిన్న‌పాటి క‌థ‌నం మాదిరి రాసి వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తాను. నేను చెప్పిన అంశాల ఆధారంగా తదుప‌రి పరిశోధ‌న చేయండి. స్వీయ అధ్య‌య‌నం కూడా అవ‌స‌ర‌మేగా.!

నేడు మేధావులుగా ఛ‌లామ‌ణి అవుతున్న వారి ప్ర‌కారం.. అఖండ భార‌తం అంటే సంఘ్ ప‌రివార్ కోరుకునే పుర‌ణాల్లో చెప్ప‌బ‌డిన అవిభ‌జిత భార‌త‌దేశం. కేవ‌లం హిందూ సంస్కృతి ఉన్న భార‌తం అన్న‌ట్లు.

మ‌రి ముక్క‌లైన భార‌తాన్ని ఒక ద‌గ్గ‌ర‌కు చేర్చ‌డం అంటే..? ఇది కూడా ఆ మేధావుల భాష‌లోనే చెబుతాను. భార‌త‌దేశంలో స్వాతంత్య్ర అనంత‌రం కూడా హిందూ-ముస్లిం భాయిభాయిగా ఉన్నారు.

కాబ‌ట్టి పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌, తుర్క‌మెనిస్థాన్‌, ట‌ర్కీ, బంగ్లాదేశ్ వంటి ఇస్లామిక్ దేశాల‌న్నీ తిరిగి భార‌త‌దేశంలో ఏకం కావాలి. భార‌త‌దేశంగా పిల‌వ‌బ‌డాలి. ఎటువంటి నిషేధాలు ఉండ‌కూడ‌దు.

అంటే ప‌క్కా సెక్యుల‌ర్ స్టేట్ అన్న‌మాట‌. కాక‌పోతే వీరు అఖండ భార‌త్ అనే అంశాన్ని స‌మ‌ర్థించరు. ఎందుకంటే హిందువులు కులాల పేరిట విడిపోయి ఒక‌రినొక‌రు అణ‌చివేసుకుంటారు.

అంతే కాదండోయ్‌.. అఖండ భార‌త్ అయితే ముస్లిం మైనారిటీలను చంపేసిన చంపేస్తార‌నే భ‌యం కూడా వీరిలో ఉంద‌నుకుంటా. మొత్తానికి అచ్చం మ‌న గాంధీ తాత చేసినట్లే అన్న‌మాట‌.

అఖండ భార‌తం విడిపోయిన త‌రువాత ఇస్లాం ప్రాబ‌ల్యం ఉన్న దేశాల్లోని మైనారిటీల ప‌రిస్థితి ఏమిటో చూస్తున్నాం. ఇక భార‌త‌దేశంలో సెక్యుల‌రిజం పేరిట మెజారిటీల అణచివేత‌కు సాక్ష్యంగా నిలుస్తున్నాం.

ఎటు తిప్పి రియూనిఫికేష‌న్ పేరిట భార‌తీయుల‌కు ఉన్న ఏకైక నాన‌మాత్ర‌పు హిందూ దేశాన్ని కూడా కుట్ర‌లు జ‌రుగుతున్నాయి అన్న‌మాట‌.

మ‌రి అలాంటి సంస్థ పేరొకటి చెబుతాను తెలుసుకోండి.. దానిని ప‌రిశీలించాక‌.. నా మాట‌లు తప్పు అనిపిస్తే త‌ప్ప‌కుండా ఖండించండి.

ఆ సంస్థ పేరు ఏమిటంటే.. ఇండియ‌న్ రీయూనిఫికేష‌న్ అసోసియేష‌న్‌(ఐరా).. జ‌స్టిస్ మార్కండేయ ఖ‌ట్జూ సార్ దానికి నేతృత్వం వ‌హిస్తున్నారు. న‌టి పూన‌మ్ కౌర్, ఇంద‌ర్ వంశ్ సింగ్ ఛ‌డ్డా అనే వారు ప్ర‌చారం క‌ల్పిస్తున్నారు.

ఎటు తిప్పి పంజాబ్‌ను పాకిస్థానులో క‌ల్పేందుకు బాగానే ప్ర‌యాస ప‌డుతున్న‌ట్లు అనిపిస్తా ఉంది ఎందుకో..? అదేనండోయ్ ఖ‌లీస్థానీ ఉద్య‌మం మాదిరి.

కులం, మ‌తం లేని ఏక‌మైన భార‌త్ అంట‌.. మెజారిటీల అధిప‌త్యం లేని భార‌త‌మంత‌.. ఇప్పుడేదో అధిపత్యం ఉంది మ‌రి మ‌న‌కు. భ‌లే చెబుతారు హిందువుల‌కు మాత్ర‌మే నీతులు.

కావాలంటే వెబ్ సైట్ లింకు కూడా జ‌త చేస్తున్నాను.. ప‌రిశీలించండి మీరే. http://inreunification.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments