Saturday, January 22, 2022
Home ప్రపంచం విదేశి శ‌క్తుల తోలు బొమ్మ‌లాట‌.?

విదేశి శ‌క్తుల తోలు బొమ్మ‌లాట‌.?

తోలు బొమ్మ‌లాట భార‌తీయుల‌కు సుప‌రిచిత‌మైన‌ది. అందులోని బొమ్మ‌లు క‌థ‌కుడు ఆడించిన‌ట్లు ఆడుతాయి. మాట్లాడుతాయి కూడా. హిందీలో క‌ట్ పుత్లీ అంటారు.

పాశ్చ్యాత దేశాల్లో ప‌ప్పెట్ అని క‌ర్ర బొమ్మ‌ల‌తో క‌థ‌ను న‌డిపిస్తారు. అంటే ఒక‌రు ఆడించిన‌ట్లు ఆడే, మాట్లాడించిన‌ట్లు మాట్లాడే బొమ్మ‌లు అన్న‌మాట‌.

మ‌రి మ‌నుషులే తోలు బొమ్మ‌ల‌యితే? ఎవ‌రో ఆడించిన‌ట్లు ఆడుతూ.. మాట్లాడించిన‌ట్లు మాట్లాడితే.. ఎవ‌రి క‌థ‌లోనో పాత్ర‌లు అయితే. ఎలా ఉంటుంది? అది అస‌లు సాధ్య‌మేనా?

ఆలోచిస్తే సాధ్యం కాక‌పోవ‌చ్చు అనిపిస్తుంది క‌దా. స‌రే అదెంత వాస్త‌వ‌మ‌నేది మ‌న ఆలోచ‌న‌లు.. విచ‌క్ష‌ణ‌.. వివేకాన్ని బ‌ట్టి నిర్ణ‌యించుకోవ‌చ్చు.

గూఢ‌చ‌ర్యం గురించి మ‌న‌లో చాలా మందికి తెలుసు. సీక్రెట్ ఏజెంట్ల గురించి సినిమాల్లో చూస్తుంటాం. వారెం చేస్తారో చూపించేది క‌ట్టు క‌థ కావొచ్చు. కానీ అలాంటివారు ఉంటారు.

త‌ర‌చూ ఐఎస్ఐ ఏజెంట్లు అని వింటూ కూడా ఉంటాము. దేశ సున్నిత‌మైన సమాచారం విదేశాల‌కు చేరుస్తున్న విదేశి గూఢ‌చారుల‌ను పట్టుకున్న నిఘా వ‌ర్గాల‌ను వార్త‌లు వ‌స్తుంటాయి.

సీక్రెట్ ఏజెంట్ల ప‌ని అలా ఉంటుంద‌న్నారు. ఈ ప‌ని అన్ని దేశాలు చేస్తుంటాయి. అవి ఆయా దేశాల అవ‌స‌రం కూడా. ఎందుకంటే ప్ర‌పంచ‌మంతా ఆధిపత్య పోరుతో వెర్రి త‌లాలు వేస్తోంది.

అందుకే చాలా వ‌ర‌కు అభివృద్ధి చెందిన దేశాలు అభ‌ద్ర‌తా భావంతో.. త‌మ ఆయుధ సంప‌త్తిని పెంచుకుంటున్నాయి. కొన్ని దేశాలు ఏకంగా యుద్ధానికి తెర లేపుతున్నాయి.

అయితే ఆ యుద్ధాల వెనుక ఆయుధ ఉత్ప‌త్తి కంపెనీల కుట్ర‌లు ఉంటాయ‌నేది చాలా మందికి తెలియ‌ని బ‌హిరంగ ర‌హ‌స్యం. అంటే ఆ కంపెనీల ఉత్ప‌త్తులు అమ్ముడుపోవ‌డానికి పెడుతున్న గిల్లిగ‌జ్జాలు.

ఇలా చూస్తే ఆయుధ కంపెనీలు త‌మ వ్యాపారం కోసం దేశాల మ‌ధ్య‌.. త‌మ‌కు స‌హ‌క‌రించే ప్ర‌భుత్వ పెద్ద‌ల స‌హ‌కారంతో యుద్ధ వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నాయ‌ని మ‌నం అనుకోవ‌చ్చు.

ఇక ఇటీవ‌ల ప్ర‌పంచ‌మంతా కోవిడ్‌-19 బారిన ప‌డి కోట్లాది మంది పిట్ట‌ల్లా రాలిపోయారు. అది స‌రిపోదని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఎంతో బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించింది.

చైనా వైర‌స్ వ‌ల‌న భార‌త‌దేశం కూడా అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంది. అయితే వైర‌స్‌ను బూచిగా చూపిస్తూ.. మందేలేని రోగానికి ల‌క్ష‌ల రూపాయ‌ల ఫీజులు ప్రైవేటు ఆసుప‌త్రులు వ‌సూలు చేశాయి.

కొంద‌రిని బ‌తికిస్తే మ‌రికొంద‌రిని చికిత్స పేరుతో చంపేశాయి. అంటే త‌మ వ్యాపారానికి కోవిడ్-19ను ఒక సాకుగా మార్చుకున్నాయి. రెమిడెసివిర్‌.. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు.. కాన్స‌న్‌ట్రేట‌ర్లు బ్లాక్ అయ్యాయి.

దానికి మీడియా మెడిక‌ల్ మాఫియా అని పేరు పెట్టుకుంది. మీడియా కూడా కోవిడ్-19 పేరిట ప్ర‌జ‌ల హ‌త్య‌ల‌ను చేయ‌డానికి పరోక్షంగా స‌హ‌క‌రించింద‌నే చెప్పుకోవాలి.

ఎందుకంటే అడ్వైర్‌టైజ్మెంట్లు.. ఇత‌ర రూపాల్లో మీడియాకు ఆదాయం వ‌స్తుంది కాబట్టి. కొన్ని రాజ‌కీయ పార్టీలు కృత్రిమ బెడ్ల కొర‌త‌ను కూడా సృష్టించాయి. ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టేందుకు.

ఆ భ‌యం మాటున భార‌త ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డానికి కూడాను. కాక‌పోతే ఆ పార్టీల్లో భార‌తీయులు ఎంత మంది అనేది ప్ర‌స్తుతం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఎందుకంటే ఏ దేశ‌స్తుడు త‌న దేశం నాశ‌నం అవ్వాల‌ని కోరుకోడు. ఈ లెక్క‌న మీడియా, సోష‌ల్ మీడియా స‌హ‌కారంతో మెడిక‌ల్ మాఫియా అనేది త‌న ల‌క్ష్యంలో విజ‌యం సాధించింది.

మ‌రోవైపు ఆయుర్వేదంపై కూడా ద‌శాబ్దాల పాటుగా దుష్ప్ర‌చారం చేసింది. వైద్య‌మంటే అల్లోప‌తి మాత్ర‌మే అనేలా ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌లో భావజాలాల‌ను పుట్టించ‌గ‌లిగింది.

అంటే ప్ర‌జ‌లు తాము అనుకున్న‌ట్లు ప్ర‌వ‌ర్తించేలా చేయ‌గ‌లిగింది. ఈ లెక్క‌న ప్ర‌జ‌లు మెడిక‌ల్ మాఫియా చేతిలో తోలు బొమ్మ‌లుగా మారారు అనుకోవ‌చ్చు.

ఇవి మ‌చ్చుకు మాత్ర‌మే. నేటి ప‌రిస్థితుల్లో ఒక దేశం మ‌రో దేశంపై ప్ర‌త్య‌క్షంగా పోరాడే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌నే చెప్పుకోవాలి.

మూడో ప్ర‌పంచ యుద్ధం వ‌స్తే అణ్వాయుధాల కార‌ణంగా కేవ‌లం కొద్ది నిమిషాల్లోనే ప్ర‌పంచ‌మంతా బుగ్గిపాల‌వుతుంద‌ని ప్ర‌పంచ పెద్ద‌న్న‌ల‌కు కూడా తెలుసు.

మ‌రి ఏ విధంగా ఇత‌ర దేశాల‌పై ప‌ట్టు సాధించాలని ఇత‌ర దేశాలు ఆలోచించిన‌ప్పుడు అప్పుడు తెర లేసిందే మేధో యుద్ధం(ఇంట‌లెక్చువ‌ల్ వార్‌).

ఇది ఒక దేశ పౌరుల‌ను త‌మ దేశానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించేలా చేసే ప్ర‌క్రియ అన్న‌మాట‌. అంటే స్వ‌దేశాన్ని దేశీయులే వ్య‌తిరేకించేలా చేయ‌డం.

ఒక దేశంలో త‌మకు అనుకూలురైన వారిని త‌యారు చేసుకోవ‌డం. వారి ద్వారా ఆ దేశ వ్య‌వ‌స్థ‌ల‌ను.. రాజ‌కీయాల‌ను.. ఆర్థిక రంగాన్ని.. సామాజిక రంగాల‌ను శాసించ‌డం.

మొత్తానికి త‌మ గుప్పిట్లో పెట్టుకోవ‌డం చేస్తాయ‌న్నమాట‌. అందుకు ఆధిప‌త్యం కోసం తాప‌త్ర‌య ప‌డే కంటికి క‌నిపించ‌ని వ్య‌వ‌స్థ‌లు ఎంతో కుటిల నీతిని అవ‌లంబిస్తున్నాయి.

క్రైస్త‌వ మిష‌న‌రీల ద్వారా మ‌త మార్పిడిలు చేపిస్తున్నాయి.. ఇస్లామిక్ శ‌ర‌ణార్థుల‌ను పంపి.. మ‌త చాంద‌స‌వాదాన్ని రెచ్చ‌గొట్టి ష‌రియా తేవాలంటూ ఆక్ర‌మ‌ణ‌కు తెర‌లేపుతున్నాయి.

క‌మ్యూనిస్టులు.. లిబ‌రళ్లు.. రేష‌న‌లిస్టులు.. సెక్యుల‌రిస్టులు అంటూ న‌యా జాతుల‌ను త‌యారు చేసి మ‌త మార్పిడులు.. ఇస్లామిక్ ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు భార‌తీయులు చాలా మంది త‌మ సంస్కృతిని గౌర‌వించ‌డం మానేస్తున్నారు. ఆచార వ్య‌వ‌హారాల‌ను అవ‌హేళ‌న చేస్తున్నారు.

పూర్వీకుల నుంచి ల‌భించిన జ్ఞానాన్ని కాల‌గ‌ర్భంలో వేగంగా క‌లిపేస్తున్నారు. పాశ్చ్య‌త సంస్కృతిని అవ‌లంబిస్తూ జీవితాల‌ను దుర్భ‌రం చేసుకుంటున్నారు.

ఆరోగ్యాల‌ను పాడు చేసుకుంటున్నారు. అవ‌న్నీ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు.. మీడియా ఇంకా సినిమా ప‌రిశ్ర‌మ అనేది బ‌హిరంగ ర‌హ‌స్యం.

మ‌న అల‌వాట్ల‌ను గ‌మ‌నిస్తే.. విదేశి వ్య‌వ‌స్థ‌లు మ‌న‌ల్ని ఎలా ఆడిస్తున్నాయో అర్థ‌మ‌వుతుంది. సెక్యుల‌రిజం పేరిట మ‌న దేశానికి వ్య‌తిరేకంగా మ‌నం మాట్లాడేలా చేస్తున్నాయి.

మ‌నం అవున‌నుకున్నా.. కాద‌నుకున్నా నేడు మ‌నం కుట్ర‌ల మాయాజాలంలో చిక్కుకుని.. విచ్ఛిన్న‌క‌ర శ‌క్తుల వ‌ల‌యంలో విల‌విల‌లాడుతున్నాము.

విదేశి గూఢ‌చ‌ర్య సంస్థ‌ల‌కు మ‌న‌లోని కొంద‌రు స‌హ‌క‌రిస్తున్నారు. మ‌న‌ల్ని పిచ్చి గొర్రెల‌ను చేస్తూ బ‌క్రాలుగా మారుస్తున్నారు.

కాబ‌ట్టి దేశ సంస్కృతిని.. ఆచారవ్య‌వ‌హారాల‌ను ప‌రిర‌క్షించుకోవ‌డం ద్వారా.. స‌నాత‌న ధ‌ర్మాన్ని ఆచ‌రించ‌డం ద్వారా కుట్ర‌ల‌ను తిప్పికొట్ట‌వ‌చ్చు. మ‌న సాటి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించుకోవ‌చ్చు.

భార‌త దేశాన్ని విశ్వ‌గురువుగా మార్చుకోవచ్చు. ఆలోచించండి. శోధించండి. సాధించండి.. చైత‌న్య‌వంతులు అవ్వండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments