పోయేదేముంది!

15
13547

లాభం కోరకుండా చేసే పనే సాయం.. ఇవ్వటంలో ఉన్న సంతృప్తి తీసుకోవడంలో ఉండదు. పంచటం మన ఆచారవ్యవహారాల్లో ఉంది. మాస్కుల తయారీ దగ్గర నుంచి మొన్నటి వ్యాక్సిన్ వరకు ప్రపంచ దేశాలకు ఎంతో సహాయం చేశాం.

ఒకరి అందం వారు చేసే సేవాగుణంలో కనిపిస్తుందంటారు. మనకు నిరుపయోగమనిపించే వస్తువు మరొకరికి విలువైనది కావొచ్చు. మనం వాడని బట్టలను చదివేసిన పుస్తకాలను ఇతరులకు అందించాలి. మనకు తెలిసిన లేదా నేర్చుకున్న విషయాలను ఇతరులకి నేర్పించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎంత పంచినా జ్ఞాన సంపద తరగదు కద!

చారిటీ కోసం డబ్బులని ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసే బదులు, స్వయంగా వెళ్లి ఇవ్వటం వలన నిజంగా అవసరమైన వారికి సహాయం చేసినవారవుతాము.
నేరుగా సహాయం చేసే అవకాశం లేకపోయినా చేయగలిగే వారికి ఆ సమాచారాన్ని చేరవేయవచ్చు కూడా.

కొన్నిసార్లు మాట సాయం అవసరం అవుతుంది. బాధలో ఉన్న వారితో ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడి చూడండి. ఓటమిలో ఉన్నవారిలో ధైర్యాన్ని నింపండి. మీరు తోడుగా ఉన్నారనే భరోసా కలిగించండి.

మీ సాయం వల్ల ఒక్కరు బాగుపడిన లేదా స్ఫూర్తిని పొందిన చాలు అదే మరో సాయానికి ఊతం అవుతుంది. తరచుగా మన పరిసరాల్లో కనిపించే
మూగ జీవాలే కావొచ్చు, వృద్దులే కావొచ్చు వారికి అవసరమైన చేతనైనా సాయం చేయడం మంచి పనే అవుతుంది. ఒకరి ఆకలి తీర్చటంలో, ఆపదతో ఉన్న వారికి చేయూత అందించటంలో పోయేదేమి లేదు. మహా అయితే మనిషిగా మరో మెట్టు పైకెక్కుతాం. అంతే..!

15 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here